పత్తి పంట పూర్తిగా వరద నీటిలో అల్లాపుర్ . శివారులోని వంతెన పై నుండి వరద నీరు

రాయికోడ్ జనం సాక్షి సెప్టెంబర్ 2 రాయికోడ్ మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. రాయికోడ్ మండలంలో ఏక ధాటిగా రెండు గంటల పాటు కురిసిన వర్షానికి అల్లాపుర్  శివారులోని వంతెన పై నుండి వరద నీరు ఉదృతం గా ప్రవహిస్తుంది. వరద నీరు ఉదృతం గా ప్రవహించడంతో వివిధ గ్రామాల్లో తో సహా   రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వ్యవసాయ క్షేత్రం లో పనులు పూర్తిచేసుకొని తిరిగి వచ్చిన రైతులు వంతెన ధాటలేక తీవ్ర ఇబ్బందులకు గురైయ్యారు.ప్రతి వర్షా కాలం ఇలాగే వరద కారణంగా వంతెనను దాటేందుకు ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు.అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. భారీ వర్షం కారణంగా పంట పొలాలు నిట మునిగాయి. పత్తి పంట పూర్తిగా వరద నీటిలో మునగడం తో రైతన్నలు ఆవేదన వ్యక్తంచేశారు.