*పదవికి న్యాయం చేయడమే నా ధర్మం*
మెట్పల్లి టౌన్ సెప్టెంబర్ 13
(జనం సాక్షి)
ఇటీవల నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ జైంట్ కన్వీనర్ గా నియమితులైన మెట్పల్లి అభివృద్ధి నియోజకవర్గ సాధన కమిటీ ప్రధాన కార్యదర్శి గుంటుక సదాశివును సాధన కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సాధన కమిటీ అధ్యక్షులు తోకల సత్యనారాయణ మాట్లాడుతూ మెట్పల్లిని డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని సాగిన డివిజన్ సాధన కమిటీ ఉద్యమంలో గుంటుక సదాశివ్ కీలకంగా వ్యవహరించారని అన్ని కులాసంఘాలను అన్ని మహిళా సంఘాలను యువజన సంఘాలను సమకూర్చడంలో ఆయన చేసిన కృషి ప్రశంసనీయమైనదని అలాంటి సమర్ధుడైన నాయకుడికి పార్టీ సముచిత స్థానం కల్పించడం హర్షనీయమని ఆయన మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహించాలని కోరారు తనకు జరిగిన సన్మానాన్ని ఉద్దేశించి గుంటుక సదాశివ్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో పార్టీ తరపు గురుతర బాధ్యతలు ఇచ్చిందని దానికి న్యాయం చేయడమే నా కర్తవ్యం అని అన్నారు ఈ కార్యక్రమంలో సాధన కమిటీ సభ్యులు నాంపల్లి గట్టయ్య , గుంటుక గంగాధర్ ,మార్గం లింగారెడ్డి ,తొగిటి అంజయ్య , డాక్టర్ రాజా రత్నాకర్ ,పుల్ల రాజా గౌడ్ ,చిన్నయ్య ,గోపి ,పుట్ట ప్రేమ్ మార్గం లింగారెడ్డి ,నారాయణ తదితరులు పాల్గొన్నారు