పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ
పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ
టేకులపల్లి,మార్చ్ 29( జనం సాక్షి): టేకులపల్లి మండలంలోని బోడు, కొప్పురాయి గ్రామపంచాయతీల పరిసర ప్రాంత ప్రజలకు సుపరిచితులు, చిరస్మరణీయులైన ఆదర్శ ఉపాధ్యాయులు దేవవరపు సీతారామయ్య, ఇంద్రావతి జ్ఞాపకార్థంగా బోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివి పరీక్షలకు సిద్ధమైన పరీక్షా సామగ్రి అయిన పరీక్ష ఫ్యాడ్స్, పెన్నులు, పెన్సిల్స్, స్కెచ్ లు, స్కేల్స్ , హాల్ టికెట్ కవర్స్ బుధవారం ఆ పుణ్య దంపతులైన కుమారుడు పిఆర్టియు జిల్లా అధ్యక్షులు డి వెంకటేశ్వరరావు ఆయన సతీమణి సుజాతచేతులు మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ వీరభద్రం , గ్రామ సర్పంచ్ లక్ష్మీనారాయణ, గ్రామ పెద్దలు రాజలింగం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జగన్, పి ఆర్ టి యు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు G.మోతిలాల్ , T.సర్కార్ తదితరులు పాల్గొని, శ్రీ సీతారామయ్య గారి సేవలను గుర్తు చేస్తూ, వారి ఆశయ సాధనకు కృషి చేస్తున్న వారి వారసులు డి. వేంకటేశ్వరరావు (DV) గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేశారు.