పదిశాతం రిజర్వేషన్లపై స్టేకు సుప్రీం నిరాకరణ

న్యూఢిల్లీ,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు కల్పించిన 10 శాతం రిజర్వేషన్ల
అమలుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఈ రాజ్యాంగ సవరణను సవాలు చేస్తూ దాఖలైన తాజా పిటిషన్‌పై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. రాజకీయ కార్యకర్త తెహసీన్‌ పునావాల దాఖలు చేసిన వ్యాజ్యంతో పాటు మరి కొన్ని పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌లపై ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది.  ఇందిరా సాహ్నీ కేసులో సుప్రీంకోర్టు 1992 నాటి తీర్పు ప్రకారం అధికారికంగా రాజ్యాంగ సవరణ ఉల్లంఘించింది. రిజర్వేషన్ల ప్రయోజనం కోసం వెనుకబాటుతనం కేవలం ఆర్థిక ¬దాలో నిర్వచించలేదు. కానీ సామాజిక మినహాయింపులో పాతుకుపోవచ్చు’ అని మండల్‌ కేసులో 1992 సుప్రీంకోర్టు తీర్పును పిటిషన్‌లో ప్రస్తావించారు. ఇక్కడ మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించరాదని గతంలో సుప్రీం తీర్పు చెప్పింది. తాజా సవరించిన సీలింగ్‌తో రిజర్వేషన్లు 60 శాతానికి చేరాయి.