పదో తరగతి పరీక్షల్లో 88.08 శాతం ఉత్తీర్ణత
హైదరాబాద్: పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి పార్థసారథి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది 88.08 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు చెప్పారు. గతేడాదితో పోలీస్తే ఉత్తీర్ణత 0.24 శాతం పెరిగింది. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు మొత్తం 11,92,076 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉత్తీర్ణతలో బాలికలు పైచేయిగా నిలిచారు. బాలికలు 88.90 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలుర ఉత్తీర్ణత 87.30 శాతంగా ఉంది. చిత్తూరు జిల్లా 94.92 శాతంతో ప్రథమ స్థానంలో నిలిచింది. 67.09 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో మెదక్ జిల్లా ఉంది. రాష్ట్రంలోని 11 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా ఉత్తీర్ణత సాధించలేదు. వీటిలో మూడు ప్రభుత్వ, రెండు ఎయిడెడ్, ఆరు ప్రైవేటు పాఠశాలలున్నాయి. జూన్ 15 నుంచి 28 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
నిర్వహించనున్నారు.