పరకాల మున్సిపాలిటీలో అవిశ్వాస రగడ
కలెక్టర్‌కు లేఖ ఇచ్చిన కౌన్సిలర్లు
వరంగల్ రూరల్,జూలై10(జనం సాక్షి ): తెలంగాణలో అధికార పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ల వరుస అవిశ్వాస తీర్మానాలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో ఈ తంతు జరగ్గా, తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా ఈ జాబితాలో చేరింది. మొదటి నుంచి వివాదాస్పదంగా ఉన్న పరకాల పురపాలక ఛైర్మన్ పదవిపై అధికార, ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లు ఘాటైన విమర్శలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. వరంగల్ గ్రావిూణ జిల్లా అధికార పార్టీకి చెందిన ఛైర్మన్ రాజభద్రయ్య ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో పరకాల రాజకీయం వేడెక్కింది. పరిణామాలు వేగంగా మారి పరకాలలో పదమూడు మంది కౌన్సిలర్లు ఛైర్మన్ రాజభద్రయ్యపై కలెక్టర్‌కు అవిశ్వాస పత్రాన్ని అందించారు. ఈ మేరకు ఈ నెల 26న బలనిరూపణకు సిద్ధం కావాలని పాలకవర్గానికి కలెక్టర్ సమాచారం అందించారు.