పర్యావరణం పై బాధ్యత కలిగి ఉండాలి.

ఎంపీపీ పంద్ర జై వంత్ రావు
జనం సాక్షి ఉట్నూర్.
ఉట్నూర్ మండల కేంద్రంలోని దంతనపల్లి గ్రామంలో ఆదివారం నాడు మంత్రి కేటీఆర్ పుట్టినరోజు పురస్కరించుకొని దంతాన్పల్లి గ్రామంలో ఎంపీపీ పంద్ర జై వంత్ రావు మొక్కలు నాటడం జరిగింది.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని వర్కింగ్ ప్రెసిడెంట్ గా వాటిని బలోపేతం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూమన్న భగవంతురావ్ మాన్కోబాయి ఎంపీటీసీ లక్ష పటేల్ ఎంపిటిసి అనసూర్య బాయి తెరాస గ్రామ అధ్యక్షులు సులేమాన్ సందీప్ ఇబ్రహీం షరీఫ్ ఏసు శ్రీను జగన్ కోమటిరెడ్డి రాంరెడ్డి తదితరులు ఉన్నారు.