పర్యావరణ పరిరక్షణకు మట్టివి నాయకుల ను ప్రతిష్టించి పూజిద్దాం.
మున్సిపల్ వైస్-చైర్ పట్లోళ్ల పర్సన్ దీప నర్సింలు.
తాండూరు అగస్టు 29(జనంసాక్షి)పర్యావరణ పరిరక్షణకు మట్టివి నాయకులను ప్రతిష్టించి పూజిద్దామనిమున్సిపల్ వైస్-చైర్ పట్లోళ్ల పర్సన్ దీప నర్సింలు పిలుపునిచ్చారు.కాలుష్యం లేని పర్యావరణ హితం కోరే ఏకో ఫ్రెండ్లీ మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు విజ్ఞప్తి చేశారు..మట్టితో తయారు చేసిన విగ్రహాలతో ఎలాంటి హాని ఉండదన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్,కలర్స్, కెమికల్స్ ఇతర రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందన్నారు. ముఖ్యంగా నీరు కలుషితమై జలచరాల ఉనికికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్నారు. పర్యావరణానికి మేలు చేయాలంటే మట్టి, గోమయ గణపతి ప్రతిమల ను ప్రతిష్టించి సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించాలన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించి భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, అందమైన సమాజాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని వేల్లడించారు.