పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అంటున్న సినీ నటి అమల

సోమాజిగూడ, హైదరాబాద్‌: పనికిరాని పేపర్లు, టెట్రాప్యాక్‌లతో అలంకరణ వస్తువులు తయారు చేయడం అభినందనీయమని సినీ నటి అమల అన్నారు. బేగంపేటలోని ఎడ్జిస్టోర్‌లో రీసైకిల్‌ పేరుతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆమె తిలకించారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో ఉండే చెత్తను వృథా చేయకుండా అలంకరణ వస్తువులు తయారు చేయడం, వంటగదిలోని వ్యర్థాలతో కంపోస్టు ఎరువు తయారు చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుందని సూచించారు.