పల్లె ప్రగతి పనులను పరిశీలించిన ఎంపీఓ,డిపిఓలు.

జనంసాక్షి న్యూస్ నెరడిగొండ:
పల్లె ప్రగతిలో ఫ్రైడే డ్రైడేలో భాగంగా మండలంలోని వాగ్దరి గ్రామంలో పలు పనులను సిగ్రిగేషన్ షెడ్ తోపాటు అంగన్వాడీ కేంద్రంలో సందర్శించి శుక్రవారం రోజున మండల ఎంపీఓ,డిపిఓ అధికారి పరిశీలించి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మొదటి ప్రాధాన్యతగా చూడాలని, వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలని,లేని పక్షంలో సిజనల్ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు.ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలని మురికి కాల్వలో గుంతలో వర్షపు నీళ్లు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని,గ్రామాన్ని స్వచ్చందంగా ఉండుటకు గ్రామ పంచాయతీ గ్రామస్తులు సహకరించాలని కోరారు. భవిష్యత్తులో మంచి వాతావరణం ఏర్పడలంటే అందరూ ప్రతి ఇంటింటికి మొక్కలు నాటి వాటికి సంవరక్షించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపిఓ,డిపిఓ అధికారుల తోపాటు స్థానిక సర్పంచ్ గుమ్ముల గంగాదేవి జీపీ సెక్రటరీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.