పల్లె ప్రగతి విజయవంతం చేయాలి
గుడిహత్నూర్,మే31 (జనం సాక్షి)… ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీఓ సునీత అన్నారు మంగళవారం ఎంపిడిఓ కార్యాలయంలో పల్లె ప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ 15రోజుల పాటు నిర్వహించే పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి భీంరావ్, ఎంపీపీ భారత్, జడ్పిటిసి పతంగే బ్రహ్మానంద్, తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపిఓ లింగయ్య, సర్పంచులు, ఎ పి టి సి లుతదితరులు పాల్గొన్నారు