పవన్‌ ‘పిడికిలి’ గుర్తు తిరుగుబాటుకు చిహ్నం

– రాష్ట్ర అభివృద్ధిపై పవన్‌ విషం చిమ్ముతున్నాడు
– లోకేష్‌ను చూసి పవన్‌, జగన్‌లు వణికిపోతున్నారు
– అందుకే అసత్య ఆరోపణలు చేస్తున్నారు
– ఏపీ ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాకర్‌
అమరావతి, ఆగస్టు14(జ‌నం సాక్షి) : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పార్టీ ‘పిడికిలి’ గుర్తు ఐక్యతకు చిహ్నం కాదని, తిరుగుబాటుకు చిహ్నమని ఏపీ ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాకర్‌ ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పవన్‌ కళ్యాణ్‌ ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని, దీని ద్వారా ప్రజలను తనవైపు తిప్పుకొని రాష్ట్రంలో అల్లర్లకు తావునిచ్చేలా రెచ్చగొడుతున్నారని జూపూడి మండిపడ్డారు. ఎన్నో ఇబ్బందులు ఉన్నా.. కేంద్రం సహకరించకపోయినా సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోరాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనిస్తుందని అన్నారు. వ్యవసాయ, విద్యారంగం, పరిశ్రమ రంగం ఇలా అన్ని రంగాల్లో,అ న్ని వర్గాల ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపైపవన్‌ విషం చిమ్ముతున్నారని జూపూడి తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రత్యేక ¬దా ఇవ్వాల్సింది కేంద్రం అని, ఆ విషయంలో కేంద్రాన్ని ప్రశ్నించకుండా పవన్‌, జగన్‌లు చంద్రబాబును విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ విషయంలోనే వారి రాజకీయ ప్రయోజనాల కోసం ఏమేరకు ముందుకు సాగుతున్నారో అర్థమవుతుందని జూపూడి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పదవి కావాలనుకునే రాజకీయ నాయకుడికి ఓర్పు, నేర్పు అవసరమని ఆయన అన్నారు. పవన్‌కు మెంటల్‌ బ్యాలెన్స్‌ లేదని జనం భావిస్తున్నారని అన్నారు. చంద్రబాబుతో పాటు నారా లోకేష్‌ ప్రతిభతో రాష్ట్రానికి ప్రశమలు వెల్లువెత్తుతున్నాయని, తద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయని అన్నారు. లోకేష్‌ ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా ఆలోచిస్తూ చంద్రబాబుకు తోడుగా ఉంటున్నారని అన్నారు. అలాంటి వ్యక్తిపై నిందలు వేయడం, అసత్య ఆరోపణలు చేయడం ద్వారా ప్రజల్లో లోకేష్‌ ఇమేజ్‌ను తగ్గించేందుకు జగన్‌, పవన్‌లు ప్రయత్నిస్తున్నారని అన్నారు. లోకేష్‌ను చూసి పవన్‌, జగన్‌ వణికి పోతున్నారని జూపూడి ప్రభాకర్‌ వ్యాఖ్యానించారు. జగన్‌, పవన్‌ల తీరుతో ప్రజలు విసిగిపోతున్నారని, వారికి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని జూపడి పేర్కొన్నారు.

తాజావార్తలు