పాక్‌లో సిక్కు పవిత్ర స్థలాల సందర్శనకు అనుమతి

పెద్ద ఎత్తున వీసాలు జారీచేసిన పాక్‌ ప్రభుత్వం

ఇస్లామాబాద్‌,నవంబర్‌21(జ‌నంసాక్షి): పాకిస్థాన్‌లో ఉన్న వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శించుకునేందుకు 3800 మంది భారతీయులకు పాక్‌ వీసాలను జారీ చేసింది. ఈ ఏడాది జరగనున్న 549వ గురునానక్‌ జయంతి ఉత్సవాల్లో వాళ్లు పాల్గోననున్నారు. లా¬ర్‌లోని నాన్‌కనా సాహిబ్‌లో ఈ వేడుకలు జరుగుతాయి. సిక్కు యాత్రికులకు ఇంత పెద్ద సంఖ్యలో వీసాలు జారీ చేయడం ఇదే మొదటిసారి అని పాకిస్థాన్‌ హై కవిూషన్‌ వెల్లడించింది. పాక్‌లో ఉన్న సిక్కు మతస్థుల పవిత్ర స్థలాలను సందర్శించేందుకు ప్రతి ఏడాది వీసాలు జారీ చేస్తారు. కానీ ఎక్కువ సంఖ్యలో వీసాలు ఇవ్వడం ప్రత్యేకమైందని పాక్‌ హై కవిూషనర్‌ సోహెల్‌ మొహమూద్‌ తెలిపారు. ఇతర దేశాల్లో స్థిరపడ్డ సిక్కుల కూడా పాక్‌ వీసాలు ఇచ్చింది.

భారతీయ యాత్రికులకు ఎప్పుడూ లేనంతగా పాకిస్థాన్‌ అత్యధికంగా 3,800 వీసాలు ఇచ్చింది. నవంబరు 21 నుంచి 30 మధ్య మాత్రమే ఈ వీసాలు ఇచ్చినట్లు పాక్‌ హైకమిషన్‌ అధికారులు తెలిపారు. గురునానక్‌ 549వ జయంతి సందర్భంగా సిక్కు యాత్రికుల కోసం పెద్ద మొత్తంలో వీసాలు జారీ చేస్తున్నట్లు ఆ దేశ పాకిస్థాన్‌ హై కమిషన్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. లా¬ర్‌ సవిూపంలోని ప్రసిద్ధ సిక్కు పుణ్యక్షేత్రమైన నన్‌కనా సాహిబ్‌ను దర్శించుకునేందుకు భారత యాత్రికులకు ఈ సారి పెద్ద మొత్తంలో అవకాశం కల్పిస్తున్నట్లు పాక్‌ హైకమిషనర్‌ సోహైల్‌ మహమూద్‌ వెల్లడించారు. పాక్‌లోని సిక్కు పవిత్ర ప్రదేశాన్ని దర్శించుకునేందుకు భారత్‌లోని సిక్కు మతస్థులకు ఇదొక మంచి అవకాశమని ఆయన అన్నారు. భారత్‌కు ఇచ్చిన 3,800 వీసాలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సిక్కు యాత్రికులకు సైతం పెద్ద మొత్తంలో వీసాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. గత జూన్‌లో ఇస్లామాబాద్‌ సవిూపంలోని సిక్కు పుణ్యక్షేత్రం గురుద్వారా పంజా సాహిబ్‌ లోనికి వెళ్లకుండా పాక్‌లోని భారత హై కమిషనర్‌ అజయ్‌ బిసారియాను అడ్డుకున్నారు. దీంతో ఈ వ్యవహారం అప్పట్లో వివాదాస్పదమైంది. అయితే తాము పుణ్యక్షేత్రాల పవిత్రతను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని, ఇక్కడికి దర్శించుకునేందుకు వచ్చే యాత్రికుల మత విశ్వాసాలను కాపాడతామని తాజాగా పాక్‌ వెల్లడించింది.