పాఠశాలకు ఫర్నిచర్ అందజేత
రామకృష్ణాపూర్ , (జనంసాక్షి) : క్యాతనపల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్ గంగాకాలనీ ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల యందు రామకృష్ణాపూర్ యువత జనం కోసం స్వచ్చంద సంస్థ ఉపాధ్యక్షుడు ఎం. డి. పాషా వారి నాన్న కీర్తి శేషులు వలిమొహమ్మద్ 20వ వర్ధంతి జ్ఞాపకార్ధంగా ఐదు వేల రూపాయలు విలువ గల టేబుల్, రెండు కుర్చీలను పాఠశాల కు విరాళంగా అందజేశారు.
ఈ కార్యక్రమం లో యువత అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేష్, ఉపాధ్యక్షులు ఎం డి. పాషా, కార్యదర్శి తుంగపిండి ప్రవీణ్, సభ్యులు దొంగరి రాజేందర్, కిషోర్, రాజు, కుమారస్వామి, కట్కూరి లక్ష్మి, చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కట్కూరి శ్రీనివాస్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఈ. శ్రీనివాస్, టీచర్ అపారంజి, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం పాఠశాల సిబ్బంది యువత సేవా తత్పరత ను గుర్తించి సభ్యులను అభినందించారు.