పాడిరైతులను ఎందుకు ఆదుకోరు

ప్రభుత్వాన్ని నిలదీసిన శివసేన

ముంబయి,జూలై17(జ‌నం సాక్షి): బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టులపై కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం పాల సేకరణ ధరలను ఎందుకు పెంచడం లేదంటూ శివసేన కేంద్రాన్ని నిలదీసింది. మహారాష్ట్రలో డైరీ రైతులు నిర్వహిస్తున్న ఆందోళనకు మద్దతు ప్రకటించింది. పాల సేకరణ ధరను లీటరుకు రూ.5 చొప్పున పెంచాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రంలోని రైతు సంఘాలు సోమవారం నుండి నిరసన ఆందోళనలు ప్రారంభించాయి. అందులో భాగంగా మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో పాల టాంకర్లను ఆందోళనకారులు అడ్డుకున్నారు. రైతులకు అండబగా నిలబడాలని అన్నారు. వారిని ఆదుకునేందుకు మాటలు కాదని, చేతల్లో చూపాలని శివసేన డిమాండ్‌ చేసింది.