పాదయాత్ర సభ ను జయప్రదం చేయండి

రామకృష్ణాపూర్, (జనంసాక్షి): రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం రాజ్యాంగ విలువలను బోధిస్తూ, దాని ఔన్నత్యాన్ని ప్రబోధిస్తూ, రాష్ట్రంలో బీసీ ఎస్సీ, ఎస్టీల స్వరాజ్య స్థాపనకై దళిత్ శక్తి ప్రోగ్రాం, (డీ ఎస్ పీ) అధినేత డా. విశారాధన్ మహారాజ్ పదివేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర లో భాగంగా రామకృష్ణపూర్ పట్టణం లో పాదయాత్ర జరుగుతుందని, యాత్ర లో భాగంగా
సూపర్ బజార్ ఏరియా లో సాయంత్రం 7 గంటలకు సభ నిర్వహించడం జరుగుతుందని డీ ఎస్ పీ జిల్లా కన్వీనర్ నందిపాటి రాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజా, కుల సంఘాల నాయకులు, వివిధ పార్టీ ల నాయకులు, డీ ఎస్ పీ నాయకులు, కార్యకర్తలు, దళిత, బహుజన అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.