పారిశ్రామికోత్పత్తిలో వృద్థి
న్యూఢిల్లీ : భారత పారిశ్రామికోత్పత్తి సూచీ ఈ అక్టోబర్‌లో 8.2 శాతానికి పెరిగింది. గతేడాది అక్టోబర్‌లో 5 శాతం నమోదైన ఈ సూచీ క్రమంగా కోలుకొని 8.2 శాతంతో 16 నెలల గరిష్ఠానికి చేరుకున్నట్లు ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్స్ (ఐఐపీ )సంస్థ పేర్కొంది.