పార్ట్‌టైమ్‌ అధ్యాపకుల ఆందోళన

వరంగల్‌,జూలై13(జ‌నం సాక్షి): తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండు చేస్తూ వరంగల్‌ కాకతీయ విశ్వవిద్యాలయంలో యూనివర్శిట పార్ట్‌ టైం అధ్యాపకులు అందోళన చేపట్టారు. ప్రతి పిరియడ్‌కు 700రూపాయాల రెమ్యూనేషన్‌ ఇవ్వాలంటూ దూరవిద్య కేంద్రం నుంచి కేయూ వీసీ భవనం వరకు ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వం హవిూ ఇచ్చిన యూనివర్శిటీ అధికారలు ఇవ్వడం లేదని వారు ఆరోపించారు. 16 పీరియడ్ల పని ఉన్న వారిని ఒప్పంద అధ్యాపకులుగా నియమించాలని డిమాండు చేశారు. పార్ట్‌ టైం అధ్యాపకులసమస్యలనుపరిష్కరించకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. మా సమస్యలను పరిష్కరించని పక్షంలో అందోళనలను ఉదృతం చేస్తామని వారు హెచ్చిరంచారు.