పార్లమెంట్‌ ఎన్నికలపై ఇసి సవిూక్ష

అధికారులతో వీడియో కాన్ఫనెర్స్‌

ఎన్నికల్లో డబ్బు పంపిణీని తీవ్రనేరంగా పరిగణించాలి

కేంద్ర ఎన్నికల చీఫ్‌ కమిషనర్‌ అరోరా ఆదేశాలు

న్యూఢిల్లీ,జనవరి28(జ‌నంసాక్షి): పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. ఈ కాన్ఫరెన్స్‌లో సీఎస్‌ ఎస్‌కే జోషీ, సీఈవో రజత్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఇతర ఎన్నికల అధికారులు సచివాలయం నుంచి పాల్గొన్నారు. ఈసందర్భంగా వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణ, దానికి సంబంధించిన ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులతో చర్చించారు. త్వరలో లోక్‌సభతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికల సంఘం ప్రధాన అధికారులకు, ఆయా రాష్ట్రాల సీఎస్‌లకు లేఖ రాసింది. పోలింగ్‌ విధులు నిర్వర్తించే ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో స్పష్టమైన సూచనలు చేసింది. అధికారులకు సొంత జిల్లాల్లో పోస్టింగులు ఇవ్వరాదని ఈసీ సూచించింది. గత నాలుగేళ్లలో వరుసగా మూడేళ్లపాటు పనిచేసిన జిల్లాల్లో ఉద్యోగులకు ఎన్నికల విధులు అప్పగించరాదని తన లేఖలో పేర్కొంది. 2019 మార్చి 31 వరకు ఒకే జిల్లాలో పదవీకాలం మూడేళ్ల పూర్తవ్వనున్న ఉద్యోగులకు సదరు జిల్లాలో పోస్టింగ్‌ ఇవ్వరాదని స్పష్టంచేసింది. 2017 మే 31కి ముందు సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో విధులు నిర్వర్తించిన జిల్లాల్లో.. డీఈవో, ఆర్వో, ఏఆర్వో, ఎస్సైలకు తిరిగి పోస్టింగ్‌లు ఇవ్వరాదని సూచించింది. 2019లో లోక్‌సభతో పాటు ఏపీ, అరుణాచల్‌ప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల సంఘం ఈ లేఖలు రాసింది. ఎన్నికల్లో డబ్బు పంపిణీని తీవ్రనేరంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల ప్రధాన కవిూషనర్‌ సునీల్‌ అరోరా సూచించారు. 2019 సాధారణ ఎన్నికలను ప్రశాంతంగా సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయాలని కేంద్ర ప్రధాన ఎన్నికల కవిూషనర్‌ సునీల్‌ అరోర అన్ని రాష్ట్రాల సిఎస్‌ లను,డిజిపిలను ఆదేశించారు.ఈమేరకు సోమవారం ఢిల్లీ నుండి ఆయన సహచర ఎన్నికల కవిూషనర్‌ అశోక్‌ లావసతో కలిసి వీడియో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సిఇసి అరోర మాట్లాడుతూ సరిహద్దు రాష్టాల్రకు సంబంధించి శాంతిభద్రతలు,ఇతర అంశాలపై సవిూక్షించేందుకు వెంటనే సరిహద్దు రాష్టాల్ర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు.ఎన్నికల్లో డబ్బు పంపిణీని తీవ్రమైన నేరంగా పరిగణించి అలాంటి సంఘటనలు జరగకుండా నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.అలాగే విూడియాలో వచ్చే పెయిడ్‌ న్యూస్‌ అంశంపై సకాలంలో చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర,జిల్లా స్థాయిల్లో ఏర్పాటు చేసిన విూడియా కోఆర్డినేషన్‌ కమిటీలు సక్రమంగా పనిచేసేలా చూడాలని ఆదేశించారు. రానున్నఎన్నికల నిర్వహణకుగాను వెంటనే అవసరమైన అధికారులు,సిబ్బంది నియామకం పై ప్రత్యేక దృష్టిపెట్టి తగిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.అంతేగాక ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర స్థాయిలో వెంటనే సంబంధిత శాఖలతో సమావేశం నిర్వహించాలని సిఎస్‌ లను కేంద్ర ఎన్నికల ప్రధాన కవిూషనర్‌ సునీల్‌ అరోర ఆదేశించారు.అదే విధంగా ఎన్నికల విధులకు నియమించే అధికారులు,సిబ్బందికి సకాలంలో మెరుగైన శిక్షణా కార్యక్రమాలను ఇవ్వాలని వాటిని ఉన్నతాధికారులు సక్రమంగా పర్యవేక్షించాలని చెప్పారు.ఎన్నికలకు సంబంధించి సెన్సిటివ్‌,హైపర్‌ సెన్సిటివ్‌,కుల,మత పరమైన ప్రభావతంతో అల్లర్లు జరిగేదుంకు అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి అలాంటి ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.ఎన్నికలు సజావుగా జరిగేదుంకు వీలుగా పోలీంగ్‌ కేంద్రాల వారీ పోలింగ్‌ ఏర్పాట్లు తదితరం ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసే వెబ్‌ కాస్టింగ్‌ కు అవసరమైన సిసి టివి కెమెరాలను బయట కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు.ఎన్నికలకు సంబంధించి పెండింగ్లో ఉన్న నేరాల కేసులను సకాలంలో పరిష్కరించేందుకు వీలుగా న్యాయాధికారులతో సమన్వయం కలిగి సకాలంలో ఆయా కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలని కేంద్ర ప్రధాన ఎన్నికల కవిూషనర్‌ సునీల్‌ అరోరా అన్ని రాష్టాల్ర సిఎస్‌,డిజిపిలను ఆదేశించారు.

ఎపిలో అన్ని చర్యలు తీసుకుంటున్నాం

వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠ మాట్లాడుతూ 2019 సాధారణ ఎన్నికలను సక్రంగా శాంతియుతంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకోనుందని వివరించారు.రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయానికి అవసరమైన అధికారులు, ఉద్యోగులను ఇప్పటికే నియమించగా మరి కొంతమంది అవసరమని కోరారని వారిని కూడా వారం రోజుల్లో ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.ఎన్నికల నిర్వహణకు అవసరమైన అధికారులు,ఇతర సిబ్బంది

నియామకం, బదిలీకి సంబంధించి ఎన్నికల కవిూషన్‌ ఆదేశాల మేరకు సకాలం తగిన చర్యలు తీసుకుం టామని చెప్పారు.అదేవిధంగా రానున్న ఎన్నికల నిర్వహణకు అవసరమైన నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని సిఎస్‌ పునేఠ కేంద్ర ఎన్నికల సంఘానికి స్పష్టం చేశారు. శాంతభద్రతలు నిర్వహణకు సంబంధించి మాట్లాడుతూ గత సాధారణ ఎన్నికల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు,ఇతర సెన్సిటివ్‌,హైపర్‌ సెన్సిటివ్‌ పోలింగ్‌ కేంద్రాలు తదితర ప్రాంతాల్లో మొత్తం 293 కంపెనీల కేంద్ర బలగాలను వినియోగించడం జరిగిందని అన్నారు.