పాలిస్టర్ యజమానుల తీరుపై ఆసాముల ఆగ్రహం..
పింజర్ల సబ్సిడీ ఇవ్వాలని కోరుతూ పాలిస్టర్ కార్యాలయంట వంటావార్పుతో నిరసన.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 23. (జనంసాక్షి). ఆసాములకు రావలసిన పింజర్ల సబ్సిడీ ఇవ్వాలని కోరుతూ పాలిస్టర్ యజమానుల కార్యాలయం ఎదుట కొనసాగుతున్న దీక్షలు బుధవారం మూడవ రోజుకు చేరుకున్నాయి. మూడు రోజులుగా దీక్షలు చేస్తున్న అధికారులు ,పాలిస్టర్ యజమానులు పట్టించుకోకపోవడంపై ఆసాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. శిబిరం ఎదుట వంట వార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన తెలిపారు.ఆసాముల సమ్మెకు సంఘీభావం తెలిపిన సిఐటియు నాయకులు మూషం రమేష్ మాట్లాడుతూ గతంలోని అధికారులు పాలిస్టర్ యజమానులు పింజర్ల సబ్సిడీ ఇస్తామంటూ చేసుకున్న ఒప్పందాలు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఆసాములకు రావలసిన పింజరల సబ్సిడీని ఇప్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆసాములతో కలిసి సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో ఆసాముల సమన్వయ కమిటీ నాయకులు,సభ్యులు పాల్గొన్నారు