పాల కుంభకోణంలో పగిలిన పాపా(ప)ల పుట్ట.

పాల కుంభకోణంలో పగిలిన పాపా(ప)ల పుట్ట.- వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్న చాట్.- బాధితురాలి వీడియో, ఆడియోతో వైరల్ అవుతున్న వైనం.- నియోజకవర్గంలో ఎక్కడ చూసిన ఇదే చర్చ.- అంతా బాగే కానీ నష్టపోయిన రైతుల పరిస్థితి ఏంటి?బెల్లంపల్లి, మార్చ్ 28, (జనంసాక్షి )అరిజన్ డైరీ పేరిట బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రయివేటు డైరీ కుంభకోణం నియోజకవర్గాన్ని అతలాకుతలం చేసేస్తుంది. పాల కుంభకోణంలో పలిగిన పాపా(ప)ల పుట్ట దర్శనమిచ్చింది. ఒక వైపు డైరీ నిర్వహణ పేరిట అట్టహసంగా డైరీ ప్ర్రారంభించి, రైతులకు టోకరా వేసిన డైరీ యాజమాన్యం చేస్తున్న ఆరోపణలు నిజామా, లేక వారిని చట్టానికి అప్పగించి, రైతుల తరుపున ముందుకు వచ్చిన ఎమ్మెల్యే చెప్పింది నిజామా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణ ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. కానీ మేము రైతులను మోసగించలేదు అని కానీ, రైతుల వద్ద సేకరించిన డబ్బులు తిరిగి వాపస్ చెల్లిస్తామని కానీ అరిజన్ డైరీ యాజమాన్యం తెలపడం లేదు. తమను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మోసం చేశాడని ఆరోపిస్తున్న వారికి అలాంటి సందర్భాలు ఎందుకు వచ్చాయి అనే ప్రశ్నకు సమాధానాలు చెప్పడం లేదు.
వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్న చాటింగ్.ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కోడ్ భాషలో (టాబ్లెట్ ) పంపాలని అమ్మాయిని పంపాలని  వాట్సాప్ లో చేసిన చాట్ నియోజకవర్గంలో హీట్ పెంచింది. గత మూడు రోజులుగా రాసలీలపై గుసగుసలు కాస్త మంగళవారం అన్ని మీడియా ముందుకు రావడంతో నియోజకవర్గం అంతా ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తున్న సదరు మహిళా తన వద్ద ఎమ్మెల్యేకు సంబందించిన అన్ని ఆధారాలు ఉన్నాయని, ప్రస్తుతం తనకు ఎమ్మెల్యేతో ప్రాణహాని ఉందని మీడియా ముఖంగా వాట్సాప్ గ్రూపుల్లో ఆడియో, వీడియో క్లిప్పింగులు పెట్టడం నియోజకవర్గం వ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది. మరో వైపు తనపై వస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఖండిస్తున్నప్పటికి అంతకు రెట్టింపుతో అరిజన్ డైరీ యాజమాన్యం స్పందిస్తుంది. ఒకవేళ అరిజన్ డైరీ యాజమాన్యం వారు ఆరోపిస్తున్నట్లు ఎమ్మెల్యేకు సపరిచర్యలు చేసినట్లయితే వారు కూడా రైతులను మోసం చేసి పైసలు దండుకున్నారు. ఇక్కడ ఇద్దరు బాగానే ఉన్నారు. ఒకరు సేవలు పొంది తరిస్తే మరొకరు సొమ్ము చేసుకొని తరించారు. కానీ వీళ్ళిద్దరినీ నమ్మిన రైతుల నోట్లో మన్ను పడింది. ఇప్పటివరకు అయితే ఇంకా ఆరోపణ ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. మున్ముందు ఈ సంఘటన వల్ల బీఆరెస్ పార్టీకి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.