-->

పాల డైరీ నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే.

ఫోటో: డైరీ నిర్మాణ పనులు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే చిన్నయ్య.
బెల్లంపల్లి, ఆగస్టు11, (జనంసాక్షి)
బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీ శివారులో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఆరిజిన్ డైరీ నిర్మాణ పనులను గురువారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ముఖ్యఅతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల శ్రేయస్సు కొరకు డైరీ నిర్మాణం జరుతుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పాల డైరీ ఏర్పాటు వల్ల పాడి పరిశ్రమ వృద్ధి చెంది రైతుల ఇంట సిరుల పంట పండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ శ్వేత-శ్రీధర్, తాండూరు, నెన్నెల ఎంపీపీలు ప్రణయ్,సంతోషం రమాదేవి, తాండూరు జడ్పీటీసీ సాలిగామ బాణయ్య , బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వాసుదేవ్ అరిజన్ సీఈఓ ఆదినారాయణ, ఇతర ప్రజాప్రతినిధులు, టీఆరెస్ నాయకులు, ఆరిజిన్ డైరీ సభ్యులు, పాడి రైతులు, తదితరులు పాల్గొన్నారు.