పిచ్చిఆలోచనలతో రెచ్చిపోకు… (పార్టు…1)

పిచ్చి పిచ్చి ఆలోచనలతో
“రెచ్చిపోకు…చచ్చి పోతావ్”
పిచ్చి పిచ్చి ఆలోచనలు
వచ్చి వచ్చి నిన్ను “పిరికివాన్ని” చేస్తాయి

వద్దు వద్దు నిద్దురమాని
అర్థరాత్రి వరకు పిచ్చి ఆలోచనలొద్దు
పిచ్చి ఆలోచనలే…”పిశాచుల పిల్లలు”
కడకవి నీ పీకనే పిసికి నీ ప్రాణం తీస్తాయి

కొన్ని…పిచ్చి ఆలోచనలు
పుట్టలో “బుసలు కొట్టే త్రాచులు”
ఆ త్రాచులతో ఆడుకోకు
అవి చాటుమాటుగా
కస్సుబుస్సుమంటాయి నిన్ను కాటేస్తాయి

కొన్ని…పిచ్చి ఆలోచనలు
మెడమీద “వ్రేలాడే గండ్రగొడ్డళ్ళు”
ఆ గొడ్డళ్ళను గంటలతరబడి నూరకు
అవి ఎన్నో ఏళ్ల బంధాలను
అనుబంధాలను మొదలంటూ నరికేస్తాయి

కొన్ని…పిచ్చి ఆలోచనలు
వీధిలో “మొరిగే పిచ్చికుక్కలు”
వాటిని రెచ్చగొట్టకు మీదపడి
రక్కుతాయి నీ రక్తాన్ని రుచిచూస్తాయి

కొన్ని…పిచ్చి ఆలోచనలు
కంట్లో పడిన “కొరివికారమే”…..భరించలేం
కొన్ని…పిచ్చి ఆలోచనలు
కాలిలో “గుచ్చుకున్న ముళ్ళే”…కాస్తజాగ్రత్త (సశేషం)

రచన:
“కవి రత్న”
“సహస్ర కవి”
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్
చరవాణి…9110784502