పిచ్చికుక్క దాడిలో ఆరుగురికి గాయాలు

52p1oz6l
కామారెడ్డిగూడెం: వరంగల్‌ జిల్లా దేవరుప్పల మండలం నీర్మాల గ్రామంలో పిచ్చికుక్క దాడిలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం ఉదయం కూలి పనులకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ముగ్గురు వలస కూలీలను, వీధిలో నడిచి వెళ్తున్న మరో ముగ్గురిపై పిచ్చి కుక్క దాడిచేసింది. స్థానికులు స్పందించి గాయపడిన వారిని వెంటనే 108 వాహనంలో జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం స్థానికులు కుక్కను కొట్టి చంపారు. కుక్కల బెడద నుంచి రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.