పుట్టిన పిల్లకు తల్లిపాలు సురక్షితం

నారాయణఖేడ్ ఆగస్టు3(జనంసాక్షి)

నారాయణఖేడ్ మండలంలోని లింగాపూర్ గ్రామంలోని రెండవ అంగన్వాడీ సెంటర్ లోబుధవారం రోజు తల్లి పాల వారోత్సవాలను గ్రామ సర్పంచ్  కాసులబాద సతీష్  ఆధ్వర్యంలో అవగాహన,తల్లి పాల ప్రాముఖ్యత గురుంచి,వివహరణ కల్పించారు అంగన్ వాడి టీచర్ జట్ల ఇందిరామాట్లాడుతూ

పుట్టిన వెంటనే తల్లి పాలు త్రాగించాలి, తల్లి పాలలో రోగనిరోధక శక్తి ఉంటుంది, పిల్లలు ఆర్యోవంతంగా ఉండాలంటే తప్పని సరిగా ఆరు నెలల వరకు తల్లి పాలను మాత్రమే త్రాగించాలిఅని అన్నారు ఈకార్యక్రమంలో ఎంపీటీసీ కాసులబాద లక్ష్మి , ఏ ఎన్ ఎం శాంత, అంగన్వాడీ టీచర్ జట్ల ఇందిరా,ఎన్ లక్ష్మీ, ఆశా కార్యకర్త మరియు తల్లులు మొదలగు వారు పాల్గొన్నారు.