పురుగుల మందు తాగి తల్లీకొడుకులు కలసి ఆత్మహత్యకు పాల్పడ్డారు

వంగూరు: పురుగుల మందు తాగి తల్లీకొడుకులు అత్మహత్య చేసుకున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా వంగూరు మండలంలోని శ్రీశైలం-హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై ఉన్న సర్వారెడ్డిపల్లె బస్టాప్‌ సమీపంలోని మామిడితోటలో కూలీలుగా పనిచేస్తున్న తల్లీకొడుకులు సపావట్‌ చిట్టి(37), చంద్రబోస్‌ (15) అక్కడే అత్మహత్యకు పాల్పడ్డారు. స్థానిక ఎస్సై చంద్రమౌళిగౌడ్‌ ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.