*పురుగు నివారణకు లింగాకర్షక బుట్టలు అమర్చాలి*
మునగాల, సెప్టెంబర్ 20(జనంసాక్షి): మునగాల మండలంలోని నర్సింహులగూడెం గ్రామంలో మంగళవారం వ్యవసాయ శాఖ, బాయిర్ క్రాప్ సైన్స్ కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు ప్రత్తిలో వచ్చు గులాబి రంగు పురుగు యొక్క యాజమాన్యం గురించి రైతులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా ప్రత్తి పంటలను పరిశీలించిన అనంతరం మునగాల మండల వ్యవసాయ అధికారి బి.అనిల్ కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుతం పంటలో పచ్చదోమ, పెనుబంక, లద్దేపురుగులను గమనించడం జరిగిందని, వాటి నివారణకు వేపనూనే 5 మి.లీ (1500 పిపిఎమ్) లేదా ఫ్లోనికామిడ్ 0.3 గ్రా లేదా తయోమితాక్సిమ్ 0.2 గ్రా, పెనుబంకకి ఏసిపేట్ 1.5 గ్రా లేదా ఏసీటామిప్రిడ్ 0.2 గ్రా లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ లీటరు నీటికి కలిపి కొట్టాలని సూచించారు. లద్దేపురుగు పురుగు
నివారణకు ఇమామెక్టిన్ బెంజోఏట్ 0.5 గ్రా లేదా స్పినోసాడ్ 0.3 మి.లీ లీటరు నీటికి కలిపి కొట్టాలని సూచించారు. బాయిర్ కంపెనీ మేనేజర్ డి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ఈ సమయంలో గులాబీ రంగు పురుగు వచ్చే అవకాశం ఉన్నదని రైతులు విత్తిన 45 రోజుల నుండి గులాబి రంగు పురుగు ఉనికిని గమనించడానికి లింగాకర్షక బుట్టలు అమర్చి వరసగా 3 రోజులు బుట్టలలో 8 తల్లిరెక్కల పురుగులు పడడం గమనించిన లేదా 10% శాతం గుడ్డి పూలు లేదా 10% శాతం పురుగు ఆశించిన కాయలు గమనించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని, గుడ్డి పూలు ఎప్పటికప్పుడు ఏరి నాశనం చేయాలన్నారు. మందులు ఉదయం 10 గం.లోపు గాని సాయత్రం 7గం లోపు గాని పిచికారీ చేయాలని సూసించారు. గులాబీ రంగు పురుగు నివారనకు ప్రొఫెనోఫాస్ 2 మి.లీ లేదా క్లోరోపైరిఫాస్ 2.5 మి.లీ లేదా ఇమామెక్టిన్ బెంజోఏట్ 0.5 గ్రా లేదా స్పైనోసాడ్ 0.3 మి.లీ లేదా క్వినాలోఫాస్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి కొట్టాలని సూచించారు. పంట చివరి దశలో క్లోరోపైరిఫాస్, సైపర్ మెత్రిన్ 2 మిలీ లేదా ప్రొఫెనోఫాస్, సైపర్ మెత్రిన్ 2 మిలీ లీటరు నీటిలో కలిపి కొట్టాలని సూచించారు. అదేవిధంగా రైతు బండారు వెంకటేశ్వర్లు పంటలో గులాబి రంగు పురుగు ఉదృతి కనుగొనుట కొరకు లింగాకర్షక బుట్టలు అమర్చడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి నాగు, బాయిర్ క్రాప్ సైన్స్ మేనేజర్ డి.లక్ష్మీ నారాయణ, రైతులు పాల్గొన్నారు.
ReplyForward
|