పుష్ప గుచ్చంతో స్వాగతం పలికిన పెంట లింబాద్రి

ఇబ్రహీంపట్నం , ఆగష్టు 28 , (జనం సాక్షి ) ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహం ప్రారంభోత్సవానికి విచ్చేసిన టీఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల సంజయ్ కి టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పెంట లింబాద్రి పుష్ప గుచ్చం తో స్వాగతం పలికారు.ఈ మేరకు మాట్లాడుతూ హైదరాబాద్ లోని యశోదా హాస్పిటల్లో ఎంతోమంది పేదలకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారని ,రానున్న కాలంలో కోరుట్ల నియోజకవర్గ ప్రజలకు రాజకీయంగా సేవలందించాలని కోరారు.నాయకులు సున్నం సత్యం , దేశెట్టి రాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు.