పెంచిన అలుగును తగ్గించండి

తహసిల్దార్ కు రైతుల అభ్యర్థన
లోకేశ్వరం (జనం సాక్షి) ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద నీరు ఎక్కువగా రావడంతో తమ పంట పొలాలు నీటి పాలు కావడంతో మండలంలోని అబ్దుల్లాపూర్ , వాస్తాపూర్, జోహార్ పూర్ గ్రామ రైతులు తహసిల్దార్ ముందు బాధను వినిపించారు గత నాలుగు సంవత్సరాల క్రితం మిషన్ కాకతీయ పనిలో  భాగంగా అబ్దుల్లాపూర్ బిబి (తలాబ్ )ను   చెరువును పునరుద్ధరించారు గతంలో కంటే రెండు ఫీట్ల అలుగును పెంచడంతో తమ పంట పొలాలు నీట మునిగాయంటూ రైతులు వాపోయారు సుమారు 100 ఎకరాల నీటి పాలు కావడంతో రోడ్డున పడ్డామని తమకు ఈ పంట పొలాలు తప్ప వేరే చోట భూమి లేదని రైతులు ఆవేదన వెలిబుచ్చారు ఏది ఏమైనా రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు చొరవ తీసుకొని తమకు న్యాయం చేయాలని అధికార యంత్రంగానికి విజ్ఞప్తి చేశారు ఈ విషయమై తహసిల్దార్ ను వివరణ కోరగా ఉన్నతాధికారులకు నివేదించి సమస్యను పరిష్కరిస్తామని ఆమె తెలిపారు
 
Attachments area