పెట్రోల్ ధరల పెంపుపై మెడికల్ రిప్రజెంటేటివ్ల నిరసన
వరంగల్,మార్చి3(జనంసాక్షి): మ్టటెవాడ ప్రభుత్వం పెంచిన పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ మెడికల్ రిప్రజెంటేటివ్స్, సేల్స్ రిప్రజెంటేటివ్స్ నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని పిన్నవారి వీధిలో మంగళవారం వారు రోడ్డుపై చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ మహేశ్కర్ మాట్లాడుతూ పెంచిన పెట్రోలు ధరల మూలంగా మెడికల్ రిప్రజెంటేటివ్స్ రోజువారి ఉద్యోగ జీవితంలో ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. వెంటనే ప్రభుత్వం పెంచిన ధరలు తగ్గించాలని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు రవిప్రకాశ్, అప్రోజ్, రవి తదితరులు పాల్గొన్నారు