పెట్రోల్ బంకును ప్రారంభించిన ఎమ్మెల్యే హరిప్రియ

పెట్రోల్ బంకును ప్రారంభించిన ఎమ్మెల్యే హరిప్రియ
టేకులపల్లి, మార్చి 31( జనం సాక్షి ): ఇల్లందు, కొత్తగూడెం ప్రధాన రహదారి టేకులపల్లి మండల పరిధిలోని ముత్యాలంపాడు క్రాస్ రోడ్డులో నూతనంగా నిర్మాణం చేపట్టి ఏర్పాటు చేసిన విశ్వప్రియ ఫిల్లింగ్ స్టేషన్ (హిందుస్థాన్ పెట్రోలియం)పెట్రోల్ బంక్ ను ఇల్లందు శాసన సభ్యురాలు బానోతు హరిప్రియ చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ జీవితంలో స్థిరపడటానికి ఎన్నో అవకాశాలు వస్తాయని వాటిని సరైన సమయంలో అందిపుచ్చుకోవడం ద్వారా జీవితంలో స్థిరపడవచ్చు అన్నారు. నేడు ముత్యాలంపాడు ఎక్స్ రోడ్లో నూతనంగా పెట్రోల్ బంక్ ఏర్పాటుచేసిన లాకవత్తు లింబియా ( బోడక ) కుమారుడు లకావత్ రాజశేఖర్ ను అభినందించారు. నూతన పెట్రోల్ బంక్ ఏర్పాటుతో మారుమూల గ్రామాల నుండి రాకపోకలు సాగించే వాహనదారులకు ఎంతో సౌకర్యంగా, అందుబాటులో ఉంటుందన్నారు. నూతనంగా ప్రారంభించబడిన పెట్రోల్ బంకును వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం లాకావత్ రాజశేఖర్ కుటుంబం ఎమ్మెల్యేని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ పెట్రోల్ బంకు ప్రారంభోత్సవ కార్యక్రమానికి బేతంపూడి సొసైటీ అధ్యక్షులు లక్కి నేని సురేందర్రావు, కోయగూడెం  సర్పంచ్ పూనెం ఉమా సురేందర్, మాజీ సర్పంచ్ భూక్య తావూరియా నాయక్, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు బొమ్మెర్ల వరప్రసాద్, వైస్ ఎంపీపీ ఉండేటి ప్రసాద్, సులానగర్ ఉప సర్పంచ్ ఉండేటి బసవయ్య, బిఆర్ఎస్ నాయకులు కాలే ప్రసాదరావు, భూక్య సైదులు నాయక్, బోడ బాలు నాయక్, బానోత్ రవీందర్, గుడిపూడి మోహన్ రావు, గుడిపూడి సత్యనారాయణ,చీమల సత్యనారాయణ, బర్మవత్ శివకృష్ణ, లాకావత్ నిమ్యా, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బానోతు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.