పెట్రోల్ బంకు ప్రారంభం.

ఫోటో రైటప్: పెట్రోల్ బంకు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.
బెల్లంపల్లి, ఆగస్టు24, (జనంసాక్షి)
బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల కేంద్రంలో బుధవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పెట్రోల్ బంకును ప్రారంభించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన బంకును సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. నిన్నటి వరకు పెట్రోల్, డీజిల్ కోసం బెల్లంపల్లి పట్టణానికి వెళ్ల వలసి వచ్చెదని నేటితో మండల వాసులకు దూరభారం తగ్గిదని ఆయన పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో నాయకులు గడ్డం భీమా గౌడ్, ఇబ్రహీం, బంకు నిర్వాహకులు సింగతి శరత్ చంద్ర వర్మ, సింగతి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు