పెదప్రజలకు అండగా సిఎం సహయనిది…
బొమ్మరాశిపల్లి గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.
– టీఆర్ఎస్ మండల నాయకులు వెంకటేష్.
ఊరుకొండ, సెప్టెంబర్ 9 (జనం సాక్షి):
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు బడుగు బలహీన వర్గాల నిరుపేదలకు వరాలుగా మారాయని.. అభాగ్యులకు సీఎం సహాయ నిధి అండగా నిలుస్తుందని మండేల వెంకటేష్ అన్నారు. శుక్రవారం ఊరుకొండ మండల పరిధిలో బొమ్మరాశిపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సహకారంతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందచేశారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ మండల నాయకులు మండేల వెంకటేష్ మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ పేదలకు వైద్య సేవలు భారం కొవొద్దని రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా నిధులు అందజేస్తున్నారని పేర్కొన్నారు. గత 8 సంవత్సరాలలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతోమంది అభాగ్యులకు కోట్ల రూపాయలను అందజేసిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ కే దక్కుతుందని అన్నారు. దరఖాస్తు చేసుకొన్న అందరికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో అమలవుతున్న ప్రతి పథకాన్ని అర్హులైన పేదలందరికీ అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం బాధితులు టీఆర్ఎస్ మండల పార్టీ నాయకులు గంగాపురం సుల్తాన్ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన రూ.70000/- మరియు ఏడో వార్డు మెంబర్ మల్లికేడి శివాజీ గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన రూ.36000/- చెక్కులను టిఆర్ఎస్ మండల నాయకులు మండేల వెంకటేష్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు భాస్కర్ రెడ్డి, టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు గోవింద్ విజయ్ యాదవ్, ఉపాధ్యక్షుడు బోయ తిరుపతి, నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.