పెరిగిన గ్యాస్ ధరలపై మండల నాయకుల  నిరసనలు

 రుద్రుర్ (జనంసాక్షి):   పెరిగిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని రుద్రుర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద  బి ఆర్ ఎస్ మండల పార్టీ నాయకులు తమ నిరసన తెలియజేసారు . ఈ సందర్భంగా మండల నాయకులు మాట్లాడుతూ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మొండి వైఖరి మరియు పెరిగిన వంట గ్యాస్ ధరలకు నిరసన తెలిపారు. పెంచిన గ్యాస్ ధరలు సామాన్య ప్రజల నడ్డి విరిచే విధంగా వారిపై భారం మోపుతూ వంట చేసుకునే పరిస్థితి లేదు అన్నారు. ఉజ్వల ద్వారా గ్యాస్ సిలిండర్లు ఇచ్చి సబ్సిడీ ఇవ్వక పోగా నెలకు ఒకసారి గ్యాస్ ధరలు పెంచుతుందని, కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించి పెంచిన వంట గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో రుద్రూర్ జెడ్పిటిసి నారోజి గంగారం,  టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నేరుగంటి బాలరాజు,  మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ తోట సంగయ్య , వైస్ ఎంపీపీ నట్కరీ సాయిలు,  ఫ్యాక్స్ చైర్మన్ బద్దం సంజీవరెడ్డి, బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు తోట్ల గంగారం,  సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు షేక్ ఖదర్  ఎంపిటిసి అనిల్ పటేల్ ఏఎంసీ మాజీ చైర్మన్ బంధుల సంజీవులు మండల నాయకులు ప్రసాద్,ఖలీమ్ ఖురేషి, సయ్యద్ ముల్తానీ ,మండల యువజన విభాగం అధ్యక్షులు కన్నె రవి, మండల సోషల్ మీడియా కన్వీనర్ లాల్ మహమ్మద్, చిక్కడపల్లి మాజీ సర్పంచ్ హనుమంతు టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు మోహన్, శానం హన్మండ్లు బాపూజీ లింగం కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు