పెరూలో పెళ్లి వేడుకల్లో విషాదం
¬టల్ గోడ కూలి 15మంది మృత్యువాత
లిమా,జనవరి28(జనంసాక్షి): పెళ్లి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. పెరూలోని ఒక ¬టల్‌లో నిర్వహిస్తున్న పెళ్లి వేడుకలో గోడ కూలడంతో 15మంది మృతి చెందినట్లుస్థానిక విూడియా పేర్కొంది. ఆగేయ పెరూలోని అబాన్కే నగరంలో ఆదివారం కొండచరియలు విరిగి ఒక ¬టల్‌పై పడటంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలపింది. ¬టల్‌లో వేడుక జరుగుతున్న సమయంలో సుమారు 100మంది ఉన్నారని అబాన్కే మేయర్ తెలిపారు. గడిచిన ఐదు రోజుల నుండి వర్షాలు కురుస్తున్నాయని, దీంతో ఒక్కసారిగా కొండచరియలు విరిగి ¬టల్ గోడవిూద పడినట్లు తెలిపారు. ఈప్రమాదంలో 15 మంది మృతి చెందగా, 32మంది గాయపడినట్లు ఆయన వెల్లడించారు. వధూవరుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అన్నారు.



