పెళ్లికి ముందే వరకట్న వేధింపులు : అధ్యాపకురాలు ఆత్మహత్య
వరంగల్,ఏప్రిల్2(జనంసాక్షి): వరకట్న వేధింపులకు తాళలేక ఓ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకుంది . పెళ్లికి ముందే కట్న వేధింపులు రావడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. వరంగల్ జిల్లా చిన్నబోయినపల్లిలో ఈ గఠన జరిగింది. ఇక్కడ అధ్యాపకురాలు మమత ఆత్మహత్యకు పాల్పడింది. వరకట్నం వేధింపులతో మమత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వైద్యుడు వెంకటరమణ, మమత నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. వైద్యుడు వెంకటరమణతో మమతకు గతేడాది నిశ్చితార్థం జరిగింది. వెంకటరమణ మరో వివాహం చేసుకోబోతున్నాడని తెలియడంతో మనస్తాపంతో మమత ఆత్మహత్యకు పాల్పడింది. మమత ఆత్మహత్యతో వెంకటరమణ పరారీలో ఉన్నాడు.