పేదలకు అండగా లైన్స్ క్లబ్ సేవలు
*షఫర్డ్ స్వచ్ఛంద సంస్థ అధినేత లయన్ రోయ్యురి సురేష్ సహకారంతో నిత్యావసర సరుకులు, ఎనర్జీ డ్రింక్, బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ
తూప్రాన్, జనం సాక్షి సెప్టెంబర్ 23
రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద హమాలిలు కష్ట పడి లారీల నుండి బరువైన సంచులు విపు పై వేసుకొని శ్రమిస్తుంటారని డిస్ట్రిక్ట్ చైర్మన్ లయన్ జానకిరామ్ అన్నారు. అలాంటి హమాలీ కార్మికులకు విజయదశమి దసరా పండుగ సందర్భంగా తూప్రాన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో షెఫర్డ్ స్వచ్ఛంద సంస్థ అధినేత లయన్ రొయ్యురు సురేష్ సహకారంతో శుక్రవారం శ్రీ సరస్వతీ స్టేషనరీ షాప్ వద్ద హమాలీ కార్మికులకు దసర బొనాంజా గా బియ్యం, కంది పప్పు, చాక్లెట్లు, బిస్కెట్లు, ఎనర్జీ డ్రింక్, కోకోనట్ వాటర్, మ్యాడ్ ఆంగిల్ చిప్స్, బాంబినో, నూడిల్స్, డాబార్ తేనె, గ్రీన్ టీ తదితర నిత్యావసర వస్తువుల ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ చైర్మన్ లయన్ జానకిరామ్ మాట్లాడుతూ మానవ జన్మ ఎత్తినందుకు సమాజంలో గుర్తింపు పొంది నల్గురిచే మంచోడు అని అనిపించు కావాలని అన్నారు. తూప్రాన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమానికు అనూహ్య స్పందన లభించింది. ఈ సందర్భంగా లయన్ జానకీ రామ్ మాట్లాడుతూ షఫర్డ్ స్వచ్ఛంద సంస్థ అధినేత లయన్ రోయ్యూరి సురేష్ సహకారంతో తూప్రాన్ లోనీ నిరుపేద హమాలీలకు ఎనర్జీ డ్రింక్ పంపిణీ చేయడం జరిగిందనీ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న లయన్స్ సేవలు అభినందనీయం అని వారి మేలు ఎప్పటికీ మర్చిపోను హమాలీ సంఘ నాయకులు బిక్షపతి, శ్రీనివాస్ లు అన్నారు. తూప్రాన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శఫర్డ్ స్వచ్ఛంద సంస్థ అధినేత లయన్ రోయ్యురీ సురేష్ సహకారంతో తూప్రాన్ లోనీ నిరుపేద హమాలీ కార్మికుల కుటుంబాలకు కోకోనట్ వాటర్, మ్యాంగో జ్యూస్, చాక్లెట్లు, ఎనర్జీ డ్రింక్ పంపిణీ చేయడం చాలా సంతోషంగా, ఆనందంగా ఉందని అన్నారు.అందరూ నోటితో ఊరికినే అది చేస్తాం, ఇది చేస్తాం అని మాట్లాడి చెపుతుంటారని అదే లయన్స్ క్లబ్ మాత్రం సేవ చేస్తూ మాట్లాడే పెదవులకన్న సహాయం చేసే చేతులు మిన్న అని అనే విధంగా సేవలు అందిస్తారని అన్నారు. తూప్రాన్ లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలను కొనియాడారు. ఇంటర్ నేషనల్ లయన్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో జరిగిన సేవా కార్యక్రమాలను టివిలో పేపర్లో చదివి తెలుసుకున్నానని నేడు కళ్ళతో చూసే అదృష్టం కల్పించిన గొప్ప మనసున్న మనిషి లయన్ జానకిరామ్ మాకు చిరకాల పరిచయం అని అన్నారు. శఫర్డ్ స్వచ్ఛంద సంస్థ అధినేత లయన్ రొయ్యురి సురేష్ కుమార్ సహకారంతో ఈ ప్రాంతంలోని నిరుపేదలకు మరింత సేవ చేసే భాగ్యం కలిగిందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ లయన్ జానకిరామ్, నాగరాజు, సి.ఆర్ హర్ష వర్ధన్, ప్రశాంత్, శ్రీనివాస్, భాస్కర్, స్వామి లతోపాటు హమాలీ కార్మిక సంఘం నాయకులు శ్రీనివాస్, బిక్షపతి, శ్రీశైలం, జైపాల్, కృష్ణ, వేణు, అశోక్, శంకర్, వెంకట్, శ్రీశైలం, శంకర్, నెల్లూరు, వేణు, వెంకట్, రమేష్, ఎల్లం, స్వామి, రవి, ఆంజనేయులు, మల్లేశ్, యాదగిరి, నారాయణ, కుమార్, యాదగిరి, శంకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area