పేదలను కొట్టి పెద్దలకు పెడుతున్న పాలకులు.
– కులం,మతం,ప్రాంతాలుగా చీల్చుతున్న బూర్జువా పార్టీలు
అశ్వారావుపేట, సెప్టెంబర్ 12( జనం సాక్షి)
అధిక ధరలు,జిఎస్టీ పేరుతో పేద ప్రజానీకం దగ్గర గుంజి న ప్రజా ధనాన్ని కేంద్రం రాష్ట్ర పాలకులు పెట్టుబడిదారులకు,పారిశ్రామిక వేత్తలకు దారాదత్తం చేస్తున్నాయని సిపిఐ(ఎం) రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య భాజపా,తెరాస లు పై ధ్వజం ఎత్తారు.
పార్టీ మండల కమిటీ ఆద్వర్యంలో విస్త్రుత సర్వసభ్య సమావేశం సోమవారం నందిపాడు లో మండలం కమిటీ సభ్యుడు మడకం పెద్ద ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు అయిన ఐలయ్య మాట్లాడుతూ…
అధికారమే పరమావధిగా కులాల పేరుతో ఒక పార్టీ,మతం ముసుగులో మరో పార్టీ,ప్రాంతీయతా బేధాలు రెచ్చగొడుతూ ఇంకో పార్టీ సమాజాన్ని విభజించి పబ్బం గడుపుకుంటన్నాయని ఆవేదన చెందారు.ఎవరు ఎన్ని మాయమాటలు చెప్పినా భిన్న సంస్క్రుతులు ఉన్న భారత దేశానికి విశాలభావం,లౌకికతత్వమే శిరోధార్యం అని అన్నారు.
పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పుల్లయ్య మాట్లాడుతు ప్రజాప్రయోజన రీత్యా నే రాజకీయ ఎత్తుగడ లు ఉంటాయని అందులో భాగంగానే సిపిఐ(ఎం) మత తత్వ భావనకు వ్యతిరేకంగా తెరాస తో తాత్కాలిక ఎన్నికల ఒడంబడిక కు రావడం జరిగిందని పార్టీ శ్రేణులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్,పార్టీ సీనియర్ నాయకులు ఊకే వీరాస్వామి,ఉప సర్పంచ్,మండల కమిటీ సభ్యులు తుట్టి వీరభద్రం,గడ్డం సత్యనారాయణ,మడివి నాగేశ్వరరావు లు పాల్గొన్నారు.