పేషెంట్ సపోర్ట్ యాప్ ఆవిష్కరించిన రోష్ ఫార్మా ఇండియా

 భారతదేశంలో రోష్ వారి బ్లూట్రీ పేషెంట్ సపోర్ట్ ప్రోగ్రాంలో భాగస్తులైన అర్హతగల రోగులకు అందుబాటులో మొబైల్ యాప్ టెక్నాలజీ ప్లాట్ఫాంతో రోగుల అనుభవం మెరుగవుతుంది. రకరకాల పేషెంట్ సపోర్ట్ సేవలను సులభంగా పొందగలరు.రోష్ ఫార్మా ఇండియా భారతదేశంలో రోష్ వారి బ్లూ ట్రీ పేషెంట్ సపోర్ట్ ప్రోగ్రాంలో భాగమైన బ్లూ ట్రీ 2.0 మొబైల్ యాప్ అనే కొత్త డిజిటల్ ప్లాట్ఫాంను ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ఫాంలు రెండింటిలోనూ ఉండే ఈ మొబైల్ అప్లికేషన్, రోగులు వివిధ  రకాల పేషెంట్ సపోర్ట్ సర్వీసులను పొందడాన్ని సులభతరం చేస్తుంది.తద్వారా వారి చికిత్సలను సులభతరం చేస్తుంది. ప్రోగ్రామ్ నమోదును వేగవంతం చేయడం ద్వారా రోగి, వైద్యుల అనుభవాన్ని మెరుగుపరచడం పలురకాల సేవలను పొందడానికి సులభమైన అందుబాటు ముందస్తు నోటిఫికేషన్లను అందించడం రోగులకు ముఖ్యంగా మారుమూల ప్రదేశాలలో ఉన్నవారికి ప్రోగ్రామ్ స్థాయిని అందుబాటును పెంచడం వారి ఫోన్ల ద్వారానే నేరుగా నిర్వహించడానికి వీలుగా చేయడం ఈ యాప్ లక్ష్యం మొబైల్ యాప్ ద్వారా రోగులు పొందగలిగే కీ బ్లూ ట్రీ ప్రోగ్రామ్ ఫీచర్లు ప్రయోజనాల్లో పూర్తయిన శాతాన్ని సూచించే ఎన్రోల్మెంట్ ట్రాక్టర్తో ప్రోగ్రాంకు డిజిటల్ ఎన్రోల్ మెంట్ రోష్ వారి పేషెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రాంలో భాగంగా ఉచిత మందులు కావాలని కోరవచ్చు
మానసిక ఆరోగ్యం ఫిజియోథెరపీ ఆరోగ్యకరమైన ఆహారం మొదలైనవాటిపై ఉచిత నిపుణుల సంప్రదింపుల కోసం ఒక బటన్ క్లిక్ చేయడం ద్వారా బుక్ చేయండి. కొన్ని రకాల క్యాన్సర్లలో సమర్థవంతమైన రోగులకు తగినట్లుగా ఉండే చికిత్సా నిర్ణయాలకు మార్గనిర్దేశం చేయడానికి ఫౌండేషన్ మెడిసిన్ వారి సమగ్ర జన్యు ప్రొఫైలింగ్తో సహా ఉచిత డయాగ్నస్టిక్ సపోర్ట్ సేవల బుకింగ్, రోగులు, వారి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ఫండింగ్ సపోర్ట్, వడ్డీ లేని ఈఎమ్ఐలు అవగాహనను మెరుగుపరచడానికి విశ్వసనీయమైన వర్గాల నుంచి వ్యాధి గురించిన ఖచ్చితమైన తగినంత సమాచారం అందిస్తారు.