పొడుకై గిరిజన గోడు -చలో ప్రగతి భవన్

రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజన సమస్యలను పరిష్కరించే సమయం లేనందున వారి వద్దకే రాష్ట్రంలో ఉన్న ఆదివాసి గిరిజన రైతులు, నాయకులు, మేధావులతో కలిసి ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసి గిరిజన దినోత్సవం రోజున ప్రగతి భవన్ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని సేవలాల్ సేన జిల్లా అధ్యక్షులు గుగులోత్ మల్లేష్ నాయక్ పిలుపునిచ్చారు.శనివారం లంబాడిపల్లి తండాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2021 నుంచి నవంబర్ 8 నుంచి డిసెంబర్ 31 దాకా భూమి హక్కు పత్రాల కోసం ప్రభుత్వం దరఖాస్తులు తీసుకున్నదని, రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి శ్రీ సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి సంవత్సరం కావస్తున్నా హక్కు పత్రాల ఊసే లేదని, సమస్యల పరిష్కారానికై ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవం అయినా ఆగస్టు 9న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రగతి భవన్ కార్యక్రమాన్ని చేపట్టామని, ఈ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా నుండిపోడు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన జిల్లా యువజన నాయకులు ప్రవీణ్ నాయక్, సేవలాల్ సేన మండల అధ్యక్షులు సక్లల్ నాయక్ తండా నాయక్ మీటు నాయక్ తదితరులు పాల్గొన్నారు