పొలం బాట పట్టిన యుపిఎస్ పాఠశాల తుప్పత్రాల విద్యార్థులు

అయిజ ,ఆగస్టు 27 (జనం సాక్షి):
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం తుపత్రాల గ్రామంలోని
పొలం బాట పట్టిన యుపిఎస్ పాఠశాల తుప్పత్రాల
పొలం బాట పట్టిన యుపిఎస్ పాఠశాల తుప్పత్రాల విద్యార్థులు
స్పందన రాకపోవడంతో శనివారం నా విద్యార్థులు పొలం బాట పట్టారు.
ఒక్కసారి వివరాల్లోకి వెళితే యుపిఎస్ తుపత్రాల, జోగులాంబ గద్వాల్ జిల్లా అయిజ మండలం తుపత్రాల గ్రామంలో పాఠశాల యందు ఒకటి నుండి ఏడు తరగతులు ఉన్నాయి.
ఇందులో 190 పైగా విద్యార్థులు చదువుతూ కేవలం ముగ్గురే ఉపాధ్యాయులు ఉండడం వలన తమ పిల్లలకు సరైన విద్య అందక పోవడంతో. గత మూడు రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తూ.
శనివారం నా పిల్లల్ని తమ సొంత పనులకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. వీరికి అదనంగా నలుగురు ఉపాధ్యాయులు ఇస్తే తప్ప పిల్లల్ని బడికి పంపమని ముకుమ్మడిగా ఎస్ యంసి చైర్మన్ కె రాఘవేంద్ర మరియు సభ్యులు తల్లిదండ్రులు తెలియజేశారు.
ఇలాగే ఉపాధ్యాయులుగ పంపకపోతే సోమవారం నుంచి మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని విద్యార్థులు వారి తల్లిదండ్రులు హెచ్చరించారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే ఉపాధ్యాయులను నియమించే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేటున్నారు.
లేదంటే మా విద్యార్థుల భవిష్యత్తును కోల్పోతుందని కావున చదువు అనే విజ్ఞానాన్ని పెంచుతుంది కాబట్టి ఆ చదువును దూరం చేయకుండా తక్షణమే మాకు ఉపాధ్యాయులు నియమించి పూర్తిస్థాయిలో విద్యను అందించే విధంగా పూర్తి చర్యలు చేపట్టాలని  ఉన్నతాధికారులకు విద్యార్థులు తెలిపారు.