పొలాల అమావాస్య పండుగ

గుడిహత్నూర్: ఆగస్టు 27( జనం సాక్షి) పొలాల అమావాస్య పండుగను శనివారం  మండల కేంద్రంతో పాటు సీతా గొంది, కమలాపూర్ తదితర గ్రామాలలోరైతులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ఉదయాన్నే బసవన్నలను మేతకు తీసుకువెళ్లి శుభ్రంగా కడిగి కొమ్ములకు రంగులు అద్ధి అందంగా అలంకరించి  సాయంత్రం గ్రామస్తులు వారి వారి బసవన్నలను హనుమాన్ ఆలయం దగ్గరికి తీసుకొని వచ్చి  ఆలయంచుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి ఇంటికి తీసుకెళ్ళి హారతులు ఇచ్చి ఇంట్లో పిండి వంటలతో చేసిన నైవేద్యాలను బసవన్నలకు తినిపించారు పాడి పంటలు సమృద్ధిగా పండాలని తమ కోసం ఆరుగాలం కష్టపడి బసవన్నలను పూజించారు అనంతరం రైతులు తమ ఉపవాసాలు ముగిస్తారు