పోడుభూములకు ఎప్పుడు పట్టాలిస్తారు
మహాదేవపూర్ ఆగస్టు25 (జనంసాక్షి)
గత కొన్ని సంవత్సరాలుగా పోడు చేసుకున్నవారికి పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని ప్రజా సంఘాల ఆధ్వర్యలో గురువారం మహాదేవపూర్ లోని అటవీశాఖ కార్యాలయం ఎదుట బైటాయించి ధర్నా నిర్వహించారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని చలో మహాదేవపూర్ అటవీశాఖ కార్యాలయం ముట్టడికి ప్రజాసంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో మహాదేవపూర్ సబ్ డివిజనల్ అటవీశాఖ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మహాదేవ్ పూర్, పలిమేల,మహాముత్తారం. కాటారం .మలహర్ రావు. మండలాలలో పోడుభూములుసాగు చేస్తున్న వారికి పట్టాలు ఇవ్వాలని తుడుందెబ్బ ,ప్రజా సంఘాలు డిమాండ్ చేశారు. పోడు సాగు చేస్తున్నవారిపై పెట్టిన అక్రమ కేసులను వెంఠనే ఎత్తివేయాలని కోరుతూ ఎఫ్ డి ఓ కు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు మడే కుమార్ అదివాసి. తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు బెల్లంకొండ పోచయ్య. జిల్లా ఉపాధ్యక్షుడు పీర్ల సమ్మయ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మడే సత్యనారాయణ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గొరిగే కిరణ్ సహాయక కార్యదర్శి కోట అశోక్ మాల బేరి మాలబేరి రాష్ట్ర కన్వీనర్ పిక కిరణ్, ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు పొడెం దామోదర్ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు బట్టు విజయ్. ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జ్ తుటీచర్ల దుర్గయ్య. కోయధోరల అభ్యుదయ సంఘం జిల్లా అధ్యక్షులు తడెండ్ల కిష్టయ్య, సీపీఐ జిల్లా సమితి సభ్యులు పన్నాల కుమారస్వామి సీపీఐ సహాయక కార్యదర్శి యశాడపు రాజయ్య తుడుందెబ్బ మండల నాయకులు దునే సమ్మయ్య తైనేని రాము మాలహార్ రావు. తుడుందెబ్బ మండల నాయకు గుంటి బాపు పొలం శ్రీనివాస్.తదితరులు పాల్గొన్నారు.