పోడు భూములపై గిరిజనుల పోరు

ఉట్నూరులో 13న పోడుగర్జన సభ
అటవీభూముల్లో పోడు సరికాదన్న అధికారులు
ఆదిలాబాద్‌,జూన్‌10(జ‌నంసాక్షి): పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని ఆదివాసీ ఐక్య సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 13న చేపట్ట పోడుగర్జన విజయవంతం చేయాలని ఆదివాసీ సేన జిల్లా అధ్యక్షుడు కోట్నాక్‌ తిరుపతి పిలుపునిచ్చారు. మాకులపేటలో ఆదివాసీ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. కోయపోచగూడ ఆదివాసీ మహిళపై అటవీ శాఖ అధికారులు ప్రవర్తించిన తీరు, వారిపై
పెట్టిన అక్రమకేసులను ఎత్తివేయాలని నాయకులు డిమాండ్‌ చేశారు. పాదయాత్ర ప్రారంభమై 13న ఉట్నూర్‌ ఐటీడీఏ వద్ద పోడుగర్జనతో ముగిస్తుందన్నారు. పోడు భూములకు హక్కు పత్రాలు ఇచ్చే వరకు పోరాటం ఆగదని గిరిజన సంఘాలు హెచ్చరిస్తున్నాయి. పోడు భూములకు హక్కు పత్రాలు ఇచ్చే వరకు పోరాటం ఆగదని ఆదివాసీలు తేల్చిచె ప్పారు. చట్టాలకు వ్యతిరేకంగా వెళ్లకూడదని, అధికారులతో చర్చలు జరపాలని గిరిజన సంఘాల నాయకులకు వారు సూచించారు. ఆక్రమించుకున్న భూమి రిజర్వు ఫారెస్టులో ఉందని, ఇందులో పోడు సాగు చేయ రాదని అధికారులు పేర్కొంటున్నారు. మహిళలని చూడకుండా ఫారెస్ట్‌ అధికారులు దూషిస్తూ మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారని సంఘాల నాయకులు
డీఎఫ్‌వోతో వాగ్వాదానికి దిగారు. సమస్యను ఉన్న తాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పినా వారు వినలేదు. భూములు ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని అధికా రులపై మండిపడ్డారు. సుమారు 3 గంటలపాటు చర్చించినా వారు వినకపోవడంతో అధికారులు చేసేది లేక వెనుదిరిగారు. మా ప్రాణాలు పోయినా భూమిని సాధించే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదన్నారు. ఆదివాసీలకు సరుకులు, తాగునీరు, పిల్లలకు పౌష్టిహా కారం అందించేలా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీవో అధికారులను ఆదేశించారు. ఇదిలావుంటే పోడు భూముల పేరుతో అడవులను నరికివేయడం చట్టరీత్యా నేరమని, కేసులు నమోదు చేస్తామని జిల్లా అటవీశాఖ అధికారి శివాని డోంగ్రే హెచ్చరించారు. 2005కు పూర్వం పోడు భూముల్లో సాగు చేసినట్లు ఆధారాలు ఉన్నవారికి భూమి హక్కు పత్రాలు ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. కోయపోచగూడ చెందిన అది వాసీలు రిజర్వు పారెస్టు భూముల్లో చెట్ల పొదలు నరుకుతూ అడవికి నష్టం కలిగిస్తున్నారని, ఎన్నిసార్లు చెప్పినా వారు నిర్లక్ష్యంగా వ్యవహిస్తున్నారన్నారు. ప్రభుత్వం నిబంధనల గురించి తెలుసుకోకుం డా అడవులు నరికితే భూములు దక్కుతాయనే భ్రమలో పచ్చని చెట్లను నరుకుతున్నారని, కేసుల్లో ఇరుక్కుని ఇబ్బంది పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కోయపోచగూడెం ఆదివాసీలకు అవగాహన కల్పించినప్పటికి వారిలో మార్పు రాకపోవడంతోనే కేసులు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు. పోడు భూములు లేకున్నా, రిజర్వు ఫారెస్టులో భూముల కోసం ఆందోళన సాగించినా ఫలితం ఉండదన్నారు. రెవెన్యూ అధికారులతో సర్వే చేయించి ప్రభుత్వ భూములు ఉన్నట్లయితే వారికి అందేలా చూస్తామన్నారు. అడవిలో ఉపాధి పనులను కల్పించి వారికి జీవనోపాధి కల్పించేలా కృషి చేస్తామన్నారు. ఇకపై ఎవరు అడవులను నరికి పోడు సాగుకు ప్రయ త్నించినా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. పోడు భూముల్లో హక్కు పత్రాలు పొందాలనుకునే వారు నిబంధనల మేరకు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి పద్ధతి ప్రకారం ముందుకు వెళ్లాలని సూచిం చారు.