పోలీసుల ఆధ్వర్యంలో 2కె ఫ్రీడం రన్ విజయవంతం.
నెరడిగొండఆగస్టు11(జనంసాక్షి): మండలంలో పోలీసు ఆధ్వర్యంలో గురువారం రోజున 2కే ప్రీడంరన్ ను నిర్వహించారు.75వ స్వసంత్ర దినోత్సవ వజ్రోత్సవాలను పురస్కరించుకొని స్థానిక ఎస్ఐ మహేందర్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని కుంటాల ఎక్స్ రోడ్డు నుండి బుద్ధికొండ వరకు 2కె ఫ్రీడమ్ రన్ ఘనంగా నిర్వహించారు.వివిధ పాఠశాలల విద్యార్థులు రైతులు యువకులు ఉద్యోగులు రాజకీయ నాయకులు వ్యాపారస్తులు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొన్నారు.ముఖ్య అతిథిగా మండల జడ్పీటీసీ అనిల్ జాధవ్ ఎంపీపీ రాథోడ్ సజన్ స్థానిక సర్పంచ్ పాల్గొని 2కె ఫ్రీడమ్ రన్ ను జండా ఊపి ప్రారంభించారు.జనం భారీ సంఖ్యలో పాల్గొని జాతీయ జండా చేత పట్టుకొని జై జవాన్ జై కిసాన్ భారత్ మాతకి జై అనే నినాధాలతో మార్మోగింది.పెద్ద ఎత్తున 2కె ఫ్రీడమ్ రన్లో జనం పాల్గొనడంతో పోలీస్ వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పోలీసులు వివిధ శాఖ అధికారులు ఆయా పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.
Attachments area