పోస్టల్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
– ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పోస్టల్ పర్యవేక్షకుడు ఉమామహేశ్వర్.
బెల్లంపల్లి, మార్చ్ 25, (జనంసాక్షి )
పోస్టల్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీనియర్ సూపరింటెండెంట్ ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పర్యవేక్షకుడు ఉమా మహేశ్వర్ అన్నారు. శనివారం ఆయన బెల్లంపల్లి పట్టణంలోని సబ్ డివిజనల్ పోస్టఫీస్ ను సందర్శించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పోస్టల్ డివిజన్ ఏర్పడి 50 సంవత్సరాలు నిండిన సందర్బంగా బెల్లంపల్లి సబ్ డివిజనల్ ఉద్యోగులతో మేళా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్ డివిజన్ పరిధిలో ఒక్కరోజులో వందకు పైగా ఇన్సూరెన్సు పాలసీలు చేశారని, ఎటా మూడున్నర కోట్ల టర్నోవర్, ఒక్కరోజులో రూ.8,60,312 ప్రీమియం వసూలు చేసి రికార్డు సృష్టించారని, ఇదే స్పూర్తితో రాబోయే కాలంలో ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్సు ప్రాముఖ్యత వివరించి, పోస్టల్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలన్నారు. ఈకార్యక్రమంలో సబ్ డివిజనల్ పోస్టల్ ఇన్స్పెక్టర్ శ్రీరామరావు, సబ్ డివిజనల్ ఉద్యోగులు పాల్గొన్నారు.