పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వసతి లేక విద్యార్థులు నానా అవస్థలు.
నెరడిగొండ జులై (జనంసాక్షి): బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వసతి గృహాలు లేని దుస్థితి మండలంలో నెలకొందని అందుచేత డిగ్రీ నిరుద్యోగ విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుటకు నానా తంటాలు పడాల్సి వస్తోందని జిల్లా లైవ్ అధ్యక్షుడు మహేందర్ జాదవ్ అన్నారు.
సోమవారం రోజున విలేకరులతో మాట్లాడుతూ కొన్ని గ్రామ విద్యార్థులకు రోడ్డు రవాణా సౌకర్యాలు లేక వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారని అన్నారు.మండలంలో ఐదు కాలేజీలు ఉన్న హాస్టల్ వసతి లేదని గతంలో కలెక్టర్లకు వసతి సౌకర్యాలు కల్పించాలని విన్నవించాము ఎలాంటి స్పందన కనబడకపోవడంతో ఇప్పటికైనా ప్రభుత్వం ఉన్నతాధికారులు స్పందించి పోస్ట్ మెట్రిక్ వసతి గృహం సౌకర్యం కల్పించి విద్యార్థులను ఆదుకోవాలని గిరిజన లంబాడి ఐక్యవేదిక ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు మహేందర్ జాదవ్ కోరుతూ ఆవేదన వ్యక్తం చేశారు.