పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం… జెడ్పి వైస్ చైర్మన్ గిరబోయిన భాగ్యలక్ష్మి
బచ్చన్నపేట సెప్టెంబర్ 28 (జనం సాక్షి) గర్భిణీ స్త్రీలకు. బాలింతలకు. పిల్లలకు. అంగన్వాడి కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందించడమే తెలంగాణ ప్రభుత్వం యొక్క లక్ష్యమని జనగామ జడ్పీ వైస్ చైర్మన్ గిరబోయిన భాగ్యలక్ష్మి అంజయ్య అన్నారు. బుధవారం బచ్చన్నపేట మండల కేంద్రంలోని రైతు వేదిక భవన్లో అంగన్వాడి సూపర్వైజర్ పద్మ అధ్యక్షతన. సిడిపిఓ రమాదేవి. ఎంపీడీవో రఘు రామకృష్ణ. మెడికల్ ఆఫీసర్ సిద్ధార్థ రెడ్డి. ఏపీఎం
జ్యోతి. ఈవో అనిల్ రాజ్. సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి. ఏఎన్ఎం శిరీష. ఆధ్వర్యంలో మహిళలకు సామూహిక శ్రీమంతాలు. అక్షరాభ్యాసం. అన్న ప్రసన. కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె మాట్లాడుతూ’తల్లి బిడ్డల ఆరోగ్యానికి శిశువు సంపూర్ణ వికాసానికి పౌష్టికాహారం ఎంతో అవసరమని అందుకే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా. పాలు. గుడ్లు. పప్పు దినుసులు . నూనె ద్వారా సంపూర్ణ పోష్టికాహారాన్ని అందించడం జరుగుతుందని ఆమె అన్నారు. బాలింతలు. గర్భిణీలు. ప్రతిరోజు అంగన్వాడి కేంద్రానికి వెళ్లి పౌష్టికాహారం తీసుకొని ఆరోగ్యవంతంగా ఉండాలని మహిళలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్. హెల్పర్స్. ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు