ప్రగతి భవన్.. ఇకపై ప్రజా భవన్
` ఈ తీర్పు ద్వారా కాంగ్రెస్ పార్టీ బాధ్యతను మరింత పెరిగింది
` పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి):కాంగ్రెస్ పార్టీ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితమిస్తున్నట్టు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా ఆయన హైదరాబాద్‌లో విూడియాతో మాట్లాడారు.’’సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపే అవకాశాన్ని కాంగ్రెస్ నాయకులకు ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.ప్రజల ఆశయాలు, ఆకాంక్షలను అమలు చేయడానికి ఈ తీర్పు ద్వారా కాంగ్రెస్ పార్టీ బాధ్యతను మరింత పెంచారు. ఈ డిసెంబరు 3న తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారు. భారత్ జోడో యాత్ర తెలంగాణలో 21 రోజుల పాటు సాగింది. రాష్ట్ర ప్రజలకు ఏ కష్టమొచ్చిన అండగా ఉంటామని రాహుల్‌గాంధీ భరోసా ఇచ్చారు. నన్ను, భట్టి విక్రమార్కను రాహుల్ ఎంతో ప్రోత్సహించారు.సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలకు తెలంగాణతో కుటుంబ అనుబంధం ఉంది. పార్టీ సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, హనుమంతరావు తదితర నేతల సహకారంతోనే కాంగ్రెస్ విజయం సాధించింది. ఆచార్య కోదండరామ్ సలహాలు, సూచనలు తీసుకుని ముందకెళ్తాం. కాంగ్రెస్ గెలుపును ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇచ్చారు. కాంగ్రెస్ గెలుపును కేటీఆర్ స్వాగతించారు. వారి స్పందనను స్వాగతిస్తున్నా. ప్రతిపక్ష పార్టీగా భారాస సహకరిస్తుందని ఆశిస్తున్నా. ఇక నుంచి ప్రగతి భవన్.. ప్రజా భవన్ అవుతుంది’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.