ప్రజలకు అందుబాటులో వైద్యం

అమీన్పూర్ బస్తీ దవాఖాన ప్రారంభోత్సవంలో
మంత్రి హరీష్ రావు
పటాన్చెరు జులై  (జనం సాక్షి)
ప్రజలకు అన్ని రకాలుగా వైద్యం అందుబాటులో ఉండాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు. మంగళవారం నాడు పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని అమీన్పూర్  ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం
57 రకాల రక్త పరీక్షలు చేస్తుందని
మెసేజ్ రూపంలో రిపోర్ట్స్ పంపిస్తుందని
ఉచితంగా మందులు అందిస్తుందని అన్నారు.
ఆదివారం సైతం పని చేస్తుందని,బీపీ షుగర్ ఉన్న వారికి నెలకు సరిపడా మందులు అందిస్తారని చెప్పారు ప్రజలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు.రెండు కోట్ల 20 లక్షల అంచనా వ్యయంతో పటాన్ చెరు
ఆస్పత్రిలో సిటి  స్కాన్ ఏర్పాటు చేశామని
18 మంది డాక్టర్ల ను అందుబాటులో ఉంటారని
అన్నారు చాలామంది గర్భిణీలుముహూర్తాల పేరుతో సీజరియాన్  ఆపరేషన్లు చేసుకుంటున్నారు. ఇది మంచి పద్దతి కాదని
విదేశాల్లో నార్మల్ డెలివరీల కోసం ప్రయతిస్తున్నరని చెప్పారు అమీన్పూర్ లో అన్ని కాలనీలలో సిసి రోడ్లు వేస్తున్నామని,
మంచి నీటి సమస్య పరిష్కారానికి 100 కోట్ల తో రిజర్వాయర్లు కడుతున్నమని చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమంలో ఇంకా మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్, పార్టీ కార్యకర్తలు సంబంధిత శాఖ అధికారులు తదితరుల పాల్గొన్నారు.